: కల్యాణ వైభోగమే - రేపటి నుంచి పెళ్లిళ్ల జోరు, రైళ్లు, బస్సులు ఫుల్... జేబులకు చిల్లు!


తెలుగు రాష్ట్రాలకు పెళ్లిళ్ల కళ వచ్చింది. రేపటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. దీనికితోడు వరుస సెలవులు రావడంతో అన్ని ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, బస్సుల్లో టికెట్లు ఫుల్ అయిపోయాయి. హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో అధిక రద్దీ నెలకొనడంతో పలు ప్రాంతాలకు 200 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ తెలిపింది. విశాఖ, విజయవాడ, ఖమ్మం, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాలకు అదనపు బస్సులు వేసినట్టు అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు చాంతాడంత పెరిగిపోయింది. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు టికెట్ ధరలను అమాంతం పెంచాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ సైతం తనదైన శైలిలో 50 శాతం అదనపు బాదుడుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతోంది.

  • Loading...

More Telugu News