: శేషాచలం ఎన్ కౌంటర్ పై ఆసక్తికర సంవాదం
రాజ్యసభలో తమిళనాడు, కేరళ జాతీయ నేతల మధ్య ఆసక్తికర సంవాదం నడిచింది. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై వామపక్ష నేత రాజా కేంద్ర హోం మంత్రిని వివరణ అడిగారు. దీనిపై రాజ్ నాథ్ సింగ్ వివరణ ఇస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టబద్ధంగా ఎన్ కౌంటర్ చేసిందని, ఆ ప్రభుత్వం అడగలేదు కనుక తాము దర్యాప్తు సంస్థను వెయ్యలేమని స్పష్టం చేశారు. దీనికి రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. అమాయకులైన కూలీలను అన్యాయంగా కాల్చి చంపారని, ప్రజాస్వామ్యదేశంలో ఇలా చేయడం అన్యాయమని పేర్కొన్నారు. దీనిపై కేరళకు చెందిన డిప్యూటీ చైర్మన్ కురియన్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో అన్నీ ప్రజాస్వామ్య బద్ధంగానే జరుగుతాయని, ఏపీ ప్రభుత్వం ప్రమాణాలు పాటించిందని చెబుతున్నా వివాదం చేయడం సరికాదని హితవు పలికారు. అయినప్పటికీ రాజా మాట్లాడుతుండడంతో విసుగుచెందిన కురియన్, 'ప్రజాస్వామ్యబద్ధంగా అంటారు...మీరు ప్రజాస్వామ్యం పాటించరు. ఇలా అయితే ఎలా?' అంటూ ఆయనపై మండిపడ్డారు.