: జవహర్ లాల్ నెహ్రూ స్థానంలో వాజ్ పేయి... 'జనూర్మ్' స్థానంలో 'అమృత్'!
జవహర్ లాల్ నెహ్రూ అర్బన్ రెన్యువల్ మిషన్ (జెఎన్ఎన్ యూఆర్ఎం-జనూర్మ్)... పట్టణ ప్రాంతాల్లో మరింత మెరుగైన వసతుల కల్పన దిశగా, 10 సంవత్సరాల క్రితం అప్పటి అధికార యూపీఏ అట్టహాసంగా ప్రారంభించిన పథకం. ఇప్పుడా పథకం పేరు మారనుంది. జవహర్ లాల్ నెహ్రూ బదులు మరో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి పేరిట పథకాన్ని కొనసాగించాలని మోదీ సర్కారు భావిస్తోంది. ఇందుకోసం మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర క్యాబినెట్ పేరు మార్పు ప్రతిపాదనలకు అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఇకపై 'అమృత్' (అటల్ మిషన్ ఫర్ రెజువెంటేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ - ఏఎంఆర్ యూటీ) పేరిట ఈ పథకం కొనసాగుతుందని తెలుస్తోంది.