: చంద్రబాబు డైరెక్షన్ లో హత్యాకాండ కొనసాగుతోంది: అనంత వెంకట్రామిరెడ్డి


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనంతపురం మాజీ ఎంపీ, వైకాపా నేత అనంత వెంకట్రామిరెడ్డి విమర్శలు గుప్పించారు. వైకాపా నేతలు, కార్యకర్తల హత్యలను, ఫ్యాక్షనిజాన్ని సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని అన్నారు. బాబు డైరెక్షన్ లోనే హత్యాకాండ కొనసాగుతోందని... ఆయనపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పోలీసుల అండదండలతోనే వైకాపా కార్యకర్తలను హతమారుస్తున్నారని చెప్పారు. రాప్తాడులో ప్రసాద్ రెడ్డి హత్య రాజకీయ హత్య కాదంటూ డీఐజీ, ఎస్పీ ప్రకటించడాన్ని వెంకట్రామిరెడ్డి తప్పుబట్టారు. అనంతపురం జిల్లాలో జరుగుతున్న హత్యాకాండపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News