: నవీన్ జిందాల్ పాస్ పోర్టు సీజ్ చేయకపోవడంపై ప్రత్యేక కోర్టు ఆగ్రహం
బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణం కేసులో మాజీ ఎంపీ నవీన్ జిందాల్ పాస్ పోర్టు స్వాధీనం చేసుకోకపోవడంపై ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో ఈ రోజు ఈ కేసులో విచారణ జరిగింది. అభియోగాలు ఎదుర్కొంటున్న జిందాల్ పై విచారణ జరుగుతున్నందున పాస్ పోర్టును సీజ్ చేయలేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ విషయంలో సీబీఐ తీరును న్యాయస్థానం తప్పుబట్టింది. పాస్ పోర్టు స్వాధీనం విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉండకూడదని, అందరికీ ఏకరూపం విధానం అనుసరించేలా చూడాలని సీబీఐ డైరెక్టర్ కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మే 6కు వాయిదా వేసింది. అదేరోజు సీబీఐ తాజాగా సమర్పించిన అభియోగ పత్రాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోనుంది.