: ఇకపై మహమ్మద్ ప్రవక్త కార్టూన్లు వేయబోను: చార్లీ హెబ్డో కార్టూనిస్ట్
మహమ్మద్ ప్రవక్త కార్టూన్లను ప్రచురిస్తూ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఫ్రాన్స్ పత్రిక చార్జీ హెబ్డో కార్టూనిస్ట్, ఇకపై అటువంటి చిత్రాలు గీయనని ప్రకటించారు. ప్రవక్త కార్టూన్లు గీస్తూ, పేరు తెచ్చుకున్న కార్టూనిస్ట్ లుజ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. "ఇకపై మహమ్మద్ చిత్రాలు గీయను. నాకు దానిపై ఆసక్తి పోయింది" అని లుజ్ వివరించారు. "నా జీవితాంతం బొమ్మలు గీస్తూ ఉండబోను" అని కూడా ఆయన అన్నారు. ఉగ్రవాదులు ఎప్పటికీ గెలవలేరని లుజ్ వ్యాఖ్యానించారు. 'జీ సూయిస్ చార్లీ' అంటూ, లుజ్ వేసిన కార్టూన్ చార్లీ హెబ్డో పత్రిక జనవరి ఎడిషన్ కవర్ పేజీపై ప్రచురితం కాగా, ఉగ్రవాదులు పత్రిక కార్యాలయంపై తుపాకులతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆనాటి ఘటనలో 12 మంది చనిపోయారు. ఆ తరువాత వచ్చిన పత్రిక 80 లక్షల కాపీలు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది.