: సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద విజయవాడ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి: ఎంపీ నాని


సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద విజయవాడ లోక్ సభ నియోజకవర్గంలోని 264 గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్టు ఎంపీ కేశినేని నాని తెలిపారు. ఈ గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసేందుకు టాటా ట్రస్ట్ ముందుకొచ్చిందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని, ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించానని అన్నారు. ఇదే విషయమై ఢిల్లీలో ప్రధానిని నిన్న(బుధవారం) కలవగా, ప్రత్యేకంగా నానిని అభినందించారు. ఎంపీలందరూ నానిని చూసి నేర్చుకోవాలని కూడా మోదీ సూచించారు.

  • Loading...

More Telugu News