: గజదొంగ సాహూ చోరీ మొత్తం రూ.80 కోట్లు... పోలీసుల విచారణలో వెల్లడి


జల్సాల కోసం కొంతకాలంగా ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న గజదొంగ ప్రకాశ్ సాహూను పోలీసులు రెండు రోజుల కిందట పట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా అతనిని విచారిస్తే ఆశ్చర్యపోయే విషయం ఒకటి తెలిసింది. ఇప్పటివరకు అతను 47 ఆలయాల్లో రూ.80 కోట్ల విలువైన ఆభరణాలను దొంగిలించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. విజయవాడ దగ్గరలో ఉన్న ప్రసాదంపాడు సాయిబాబా ఆలయంలో అతడు దొంగిలించిన వెండిని ముంబైలో అమ్మినట్టు విచారణలో తెలిపాడు. దాంతో అతన్ని పోలీసులు ముంబైకు తీసుకువెళ్లారు.

  • Loading...

More Telugu News