: 200 పరుగులు చేసిన బెంగళూరు... వరుణుడి బ్రేక్... లక్ష్యాన్ని కుదించే అవకాశం!


సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్ మెన్ బ్యాట్లకు పనిచెప్పారు. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ 57, మన్ దీప్ సింగ్ 27, దినేశ్ కార్తీక్ 27 పరుగులు చేశారు. చివర్లో సర్ఫరాజ్ ఖాన్ వేగంగా ఆడాడు. రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 21 బంతుల్లో 45 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో, బెంగళూరు జట్టు 200 మార్కు చేరుకుంది. రాజస్థాన్ బౌలర్లలో సౌథీ 2 వికెట్లు తీయగా, కులకర్ణి, బిన్నీ చెరో వికెట్ తీశారు. కాగా,ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పివేశారు. వర్షం కారణంగా రాయల్స్ లక్ష్యఛేదన ఆలస్యమైతే ఓవర్లను, లక్ష్యాన్ని కుదించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News