: నేపాల్ భూకంపం సమయంలో మూడో అంతస్తులో ఉన్న హీరోయిన్ స్పందన


నేపాల్ లో భారీ భూకంపం సంభవించిన సమయంలో తన ఇంట్లోని మూడో అంతస్తులో ఉన్న సినీ హీరోయిన్ సోషల్ మీడియాలో తన అనుభవం వివరించింది. 'కాళీచరణ్' సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన కవితా శ్రీనివాసన్ భూకంపం నుంచి తృటిలో తప్పించుకుంది. కాళీచరణ్ సినిమా తరువాత తమిళంలో ఓ సినిమా చేసిన కవితా శ్రీనివాసన్ వివాహం చేసుకుని మూడు నెలల క్రితం ఖాట్మాండులో స్థిరపడ్డారు. 'మేం మూడో ఫ్లోర్లో ఉన్నాం. భూప్రకంపనల ధాటికి గదిలో అటూఇటూ ఊగిపోయాం. క్షేమంగా బయటపడతామని ఊహించలేదు. రాత్రంతా విద్యుత్, నీరు, ఫోన్ లేకుండా గడిపాం. మేం ప్రాణాలతోనే ఉన్నాం. కష్టకాలంలో అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు' అని కవిత సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

  • Loading...

More Telugu News