: బోకోహరమ్ చెర నుంచి 300 మందిని రక్షించిన నైజీరియా సైన్యం


బోకోహరమ్ తీవ్రవాదుల చెరనుంచి 300 మందిని నైజీరియా సైనికులు రక్షించారు. నైజీరియా ఈశాన్య ప్రాంతంలో ఉన్న సంబిశా అడవిలో బంధీలుగా ఉన్నవారిని సైనికులు విడిపించినట్టు ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ సెని మీడియాకు వెల్లడించారు. అయితే వీరిలో గతేడాది బోకోహరమ్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన పాఠశాల విద్యార్థినులు లేరని ఆయన స్పష్టం చేశారు. కాగా, బోకోహరమ్ తీవ్రవాదులు నైజీరియాలో మహిళలు, బాలికల్ని పెధ్దఎత్తున కిడ్నాప్ చేసి బానిసలుగా మార్చుకుంటున్నారు. బందీలను బెదిరించి ఆత్మాహుతి బాంబర్లుగా తయారు చేసి నైజీరియాలో విధ్వంసానికి పాల్పడుతున్నారు. నైజీరియాలో బోకోహరమ్ తీవ్రవాదులు ఎంతమందిని ఎత్తుకెళ్లారో కూడా తెలియని దుస్థితిలో అక్కడి ప్రభుత్వం ఉండడం ప్రపంచాన్ని ఆందోళనలోకి నెడుతోంది.

  • Loading...

More Telugu News