: అబ్బే, నేనలా అనలేదు...!: రైతులపై వ్యాఖ్యల పట్ల హర్యానా మంత్రి వివరణ
ఆత్మహత్యలు చేసుకునే రైతులు పిరికివాళ్లని వ్యాఖ్యానించిన హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి ఓపీ ధన్కర్ వివరణ ఇచ్చారు. తన ఉద్దేశం వేరని, హర్యానా ప్రజలు ధైర్యవంతులని, ఆత్మహత్యలు చేసుకోరాదని తాను వ్యాఖ్యానించానని తెలిపారు. తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా ప్రసారం చేసిందన్నారు. బలవన్మరణాలకు పాల్పడే రైతులు పిరికివాళ్లని, అలాంటి వ్యక్తుల కుటుంబాలకు హర్యానా ప్రభుత్వం సాయం చేయబోదని వ్యాఖ్యానించారు. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడమంటే బాధ్యతలను భార్యాబిడ్డలకు వదిలి పారిపోవడమేనని అన్నారు. ఈ వ్యాఖ్యలపై అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో మంత్రి వివరణ ఇచ్చారు.