: కరీనాకపూర్ కు మరో మైనపు విగ్రహం


బాలీవుడ్ భామ కరీనా కపూర్ ఖాన్ కు వివాహమైనప్పటికీ ఆమె పాప్యులారీటీ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికే లండన్ లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో అమ్మడికి మైనపు విగ్రహం ఉంది. తాజాగా సింగపూర్ లోని టుస్సాడ్ బ్రాంచ్ మ్యూజియంలో కూడా బెబో (ముద్దుపేరు)కు మరో మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. లేత గులాబీ రంగు చీరలో ఉన్న ఆ విగ్రహం అచ్చం కరీనాను పోలి ఉండేలా తీర్చిదిద్దడం విశేషం. అమె జుట్టు, ముఖంలోని పోలికలు కూడా కరీనాలానే ఉండటం విశేషం.

  • Loading...

More Telugu News