: రుద్రవరం పోలీసుల కస్టడీలో సినీ నటి నీతూ అగర్వాల్!
సినీ నటి నీతూ అగర్వాల్ ను రుద్రవరం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నిందితురాలిగా కర్నూలు జిల్లా నంద్యాల ఉప కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న నీతూ అగర్వాల్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని పేర్కొంటూ, రెండు రోజుల కస్టడీకి అప్పగించాల్సిందిగా పోలీసులు కోవెలకుంట్ల న్యాయస్థానాన్ని కోరారు. దీంతో న్యాయస్థానం ఆమెను పోలీసు కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నంద్యాల ఉప కారాగారంలో ఉన్న నీతూ అగర్వాల్ ను రుద్రవరం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.