: హంతకులను 24 గంటల్లో పట్టుకుంటాం: అనంతపురం ఎస్పీ


అనంతపురం జిల్లా రాప్తాడు తహశీల్దారు కార్యాలయంలో వైకాపా నేత ప్రసాద్ రెడ్డిని పాశవికంగా హత్య చేసిన హంతకులను 24 గంటల్లోగా పట్టుకుంటామని జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు తెలిపారు. ఇప్పటికే హత్యకు సంబంధించి విచారణ ప్రారంభించామని వెల్లడించారు. ఇది రాజకీయపరమైన హత్యా? లేక ఫ్యాక్షన్ హత్యా? అనే అంశంపై దృష్టి సారించామని చెప్పారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నామని, చాలా రోజులుగా ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయని ఎస్పీ తెలిపారు.

  • Loading...

More Telugu News