: వచ్చేస్తున్నాయ్ స్మార్ట్ నగరాలు... ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం


మోదీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న స్మార్ట్‌ సిటీస్‌ ఫైల్‌ కు మంత్రిమండలి ఆమోదం పలికింది. ఎన్డీయే మేనిఫెస్టోలో పెట్టడంతో పాటు, రూ. 7 వేల కోట్ల అంచనా వ్యయంతో 100 స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులు చేపడతామని బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. స్మార్ట్ సిటీల నిర్మాణానికి అవసరమైతే చట్టాలు కూడా మార్చడానికి కేంద్రం సిద్ధంగా ఉందని పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ లోగా దేశంలోని పట్టణాల్లో ప్రజలను మమేకం చేస్తూ, శుభ్రత తదితరాలపై పోటీలు పెట్టి ఎంపిక చేసిన పట్టణాలను స్మార్ట్ గా అభివృద్ధి చేయాలన్నది కేంద్రం ఆలోచన. వీటితో పాటు విద్యుత్ సరఫరా, మురుగునీటి పారుదల, ఆదాయ వనరులు, పట్టణ ప్రణాళిక తదితర అంశాల ప్రాతిపదికన నగరాల ఎంపిక జరుగుతుంది. 100 స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుల నిర్మాణం ఒకేసారి మొదలవుతుందని, ఇందులో ప్రైవేటు భాగస్వామ్యం కూడా ఉంటుందని ఎన్ డీఏ సర్కారు చెబుతోంది.

  • Loading...

More Telugu News