: మా అన్న హత్యలో పరిటాల సునీత హస్తం ఉంది... ఎస్ఐ పాత్ర కూడా ఉంది: ప్రసాద్ రెడ్డి తమ్ముడు
ఈ మధ్యాహ్నం అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో జరిగిన వైకాపా నేత ప్రసాద్ రెడ్డి హత్య వెనుక మంత్రి పరిటాల సునీత హస్తం ఉందని అతని తమ్ముడు ఆనంద్ రెడ్డి స్పష్టం చేశారు. ముందే వేసుకున్న పథకం ప్రకారం తహశీల్దారు ఆఫీసుకు ప్రసాద్ రెడ్డిని పిలిపించి హత్య చేశారని తెలిపారు. ఈ హత్య కేసులో రాప్తాడు ఎస్ఐ నాగేంద్రప్రసాద్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. తన అన్నకు ప్రాణ భయం ఉందని, రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో, టీడీపీ నేతలు చేస్తున్న హత్యలకు తాము భయపడమని కూడా ఆనంద్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.