: న్యూస్ ఛానెల్ లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోపీ


నిరుద్యోగుల ఆశలను అవకాశంగా తీసుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. న్యూస్ ఛానెల్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల నుంచి అందినకాడికి దండుకున్నాడో మోసగాడు. రేనా బ్రాడ్ కాస్టింగ్ గ్రూప్ ఆఫ్ నెట్ వర్క్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెబుతూ 70 మంది నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి, పత్తా లేకుండా పోయాడు. దీంతో ఉద్యోగాలు వస్తాయనే ఆశతో డబ్బులు కట్టిన నిరుద్యోగులు ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News