: భారత పర్యటనలో ఉన్నారు... రైతులను కలవొచ్చుగా!: మోదీపై రాహుల్ వ్యంగ్యం
ప్రధాని నరేంద్ర మోదీ తరచూ విదేశీ పర్యటనలకు వెళుతుండడంపై రాహుల్ గాంధీ వ్యంగ్యం ప్రదర్శించారు. లోక్ సభలో మాట్లాడుతూ... ఇప్పుడాయన భారత పర్యటనలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడైనా, తీవ్ర కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించవచ్చు కదా? అని సూచించారు. "పంజాబ్ వెళ్లి కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తే క్షేత్రస్థాయి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది" అని అన్నారు. అకాల వర్షాలు, ఇతర విపత్తుల కారణంగా లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిన్నదని, రైతులు తీవ్రంగా నష్టపోయారని సభకు వివరించారు. ఇది రైతుల ప్రభుత్వం కాదని విమర్శించారు.