: మండుతున్న హైదరాబాద్!


భానుడి ప్రకోపానికి హైదరాబాద్ నగరం భగభగలాడుతోంది. ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ మధ్యాహ్నం ఉష్ణోగ్రత 41 డిగ్రీలను దాటింది. ప్రస్తుత సీజన్ లో ఇంత అధిక ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రధాన రహదారులు, జంక్షన్లలో సాధారణ స్థాయితో పోలిస్తే, వాహన రద్దీ తక్కువగా ఉంది. ప్రజలు తగు జాగ్రత్తలతో మాత్రమే బయటకు వెళ్లాలని, సాధ్యమైనంత వరకూ, మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకూ బయట తిరగొద్దనీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండ తీవ్రతకు అగ్ని ప్రమాదాలు జరగవచ్చని, ప్రజలు, ముఖ్యంగా గుడిసెలు తదితరాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

  • Loading...

More Telugu News