: పొరపాటున 'ట్రాయ్'కి చేరిన ప్రేమలేఖ... అధికారుల నిర్లక్ష్యంతో బహిర్గతం


టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారుల నిర్లక్ష్యం... గోప్యంగా ఉండాల్సిన ఓ ప్రేమలేఖ బహిర్గతం అయ్యేలా చేసింది. నెట్ న్యూట్రాలిటీపై అభిప్రాయాలు తెలపాలని ట్రాయ్ చేసిన విన్నపానికి పది లక్షల మందికిపైగా స్పందించిన సంగతి తెలిసిందే. నివేదిక పేరిట మూడు రోజుల క్రితం ట్రాయ్ అధికారులు, తమ విన్నపానికి స్పందించిన అందరి ఇ-మెయిల్ వివరాలనూ బయటకు వెల్లడించి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. ఈ జాబితాలో ఒక ప్రియుడు తన ప్రియురాలికి పంపిన ప్రేమలేఖ కూడా ఉంది. ఈ లేఖ మనస్ఫూర్తిగా రాసినట్టు ఉంది. ఎంతో టెన్షన్ పడుతున్నట్టు ఉంది. తన గాఢమైన ప్రేమను తెలుపుతూ ముద్దులు కూడా ఉన్నాయి. ప్రియురాలికి పంపాల్సిన లేఖను పొరపాటున ట్రాయ్ ఐడీకి పంపినట్టు భావిస్తుండగా, ట్రాయ్ అధికారులు కనీసం మెయిల్స్ ఓపెన్ చేసి కూడా చూడలేదని, లేఖను బహిర్గతం చేయడం ద్వారా వారి స్వేచ్ఛకు భంగం కలిగించేలా చేశారని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ట్రాయ్ నిర్వాకం ఎవరికి కోపం తెప్పించిందోగానీ, మొత్తం వెబ్ సైటును గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. వెబ్ సైటును పని చేయకుండా చేసి లక్షల మందికి ఆనందం కలిగించారు.

  • Loading...

More Telugu News