: విప్రో నుంచి వేలాది మంది ఉద్యోగుల తొలగింపు!


ప్రముఖ ఐటీ ఔట్ సోర్సింగ్ సేవల సంస్థ విప్రో, వచ్చే మూడేళ్లలో వేలాది మంది ఉద్యోగులను తొలగించే దిశగా చర్యలు చేపట్టనుంది. పూర్తి ఆటోమేషన్, డిజిటల్ సర్వీసెస్ దిశగా సంస్థను నడిపించాలని భావిస్తున్న యాజమాన్యం ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సంఖ్యలో కనీసం 30 శాతం మందిని తొలగించాలని భావిస్తోంది. ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్న విప్రో సీఈఓ టీకే కురియన్ ఈ విషయాన్ని తెలిపినట్టు సమాచారం. మొత్తం 47 వేల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చని తెలుస్తోంది. తాము ఉద్యోగుల తొలగింపుపై దృష్టిని సారించడం లేదని, పనితీరును మరింత మెరుగుపరచుకునే దిశగా అడుగులు వేస్తున్నామని సంస్థ అధికారి ఒకరు వివరించారు. కాగా, మార్చి 31 2015 నాటికి సంస్థ ఉద్యోగుల సంఖ్య 1,58,217గా ఉంది. భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైన వార్తలు తెలుసుకొని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News