: జోధ్ పూర్ కోర్టుకు హాజరైన సల్మాన్... ఈ కేసులో తనను ఇరికించారని స్టేట్ మెంట్


బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అక్రమ ఆయుధాల కేసులో విచారణ నిమిత్తం ఈరోజు జోధ్ పూర్ కోర్టు ముందు హాజరయ్యారు. తాను ఎలాంటి నేరం చేయలేదని, ఈ కేసులో తనను ఇరికించారని విచారణ సందర్భంగా సల్మాన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఖండించిన సల్లూ, కేసులో సాక్ష్యాలన్నీ అవాస్తవమని పేర్కొన్నాడు. అనంతర విచారణను కోర్టు మే 4కు వాయిదా వేసింది. 1998లో ఓ హిందీ సినిమా చిత్రీకరణ కోసం కొందరు నటులతో సల్మాన్ జోధ్ పూర్ వెళ్లాడు. అక్కడ జంతువులను వేటాడిన సల్మాన్ ఆ సమయంలో అక్రమ ఆయుధాలను ఉపయోగించారంటూ ఆయుధాల చట్టం కింద కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News