: నేపాల్ కు సాయం ప్రకటించిన తమిళనాడు
తీవ్ర భూకంప ప్రభావంతో దెబ్బతిన్న నేపాల్ కు తమిళనాడు రాష్ట్రం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.5 కోట్లు ఆ దేశానికి ఇవ్వనున్నట్లు తెలిపింది. "నేపాల్ కు తక్షణ అవసరం మేరకు తమిళనాడు ప్రభుత్వం సహాయం కింద ఐదు కోట్ల రూపాయలు ఆ దేశ ప్రభుత్వానికి ఇవ్వనుంది" అని ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సాయం చేస్తుండగా, ప్రధానమంత్రి సహా లోక్ సభ సభ్యులు నేపాల్ కు తమవంతు విరాళం ప్రకటించారు.