: దుర్గమ్మ గోశాలలో విషాహారం... ఆవులు మృతి
విజయవాడ కనకదుర్గ గుడి అధీనంలోని గోశాలకు చెందిన ఆవులు విషతుల్యమైన ఆహారం తిని మృతి చెందిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఉదయం సిబ్బంది పెట్టిన గోధుమరవ్వ తిని 5 ఆవులు మరణించగా, 20 ఆవులు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. ఈ ఘటనపై గోశాల సంరక్షణ కమిటీ విచారణ ప్రారంభించింది. నిన్న సాయంత్రం వైష్ణవి ఫుడ్స్ కు చెందిన ప్రతినిధులు గోధుమరవ్వ ఇచ్చి వెళ్లారని, దాన్నే ఉదయం ఆవులకు పెట్టారని తెలుస్తోంది. ఎవరికీ అపకారం చేయని సాధు జంతువులకు కనీస పరీక్షలు నిర్వహించకుండా, కాలం చెల్లిన ఆహారం పెట్టడం శోచనీయం. ఫుడ్ పాయిజన్ కారణంగా గోవులు మృతి చెందిన విషయం తెలుసుకున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.