: ఏపీలో మరో ‘గోల్డ్’ మోసం... శ్రీ చక్ర గోల్డ్ ఫార్మ్స్ ఆస్తుల జప్తునకు సర్కారు ఆదేశాలు


అధిక వడ్డీలతో అనతికాలంలోనే మీ డబ్బును రెట్టింపు చేస్తామంటూ నయామోసానికి పాల్పడుతున్న సంస్థల ఆగడాలకు ఫుల్ స్టాప్ పడేలా లేదు. మొన్న విజేత ఆగ్రో ఫార్మ్స్, నిన్న అగ్రిగోల్డ్... తాజాగా శ్రీచక్ర గోల్డ్ ఫార్మ్స్. పేరేదైతేనేం, జనానికి మాయగాళ్లు కుచ్చుటోపీ పెడుతున్నారు. అధిక వడ్డీల ఆశ చూపి ఉత్తరాంధ్ర వాసుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన శ్రీచక్ర గోల్డ్ ఫార్మ్స్ ఆస్తులను జప్తు చేసేందుకు ఏపీ సర్కారు సీఐడీకి అనుమతిచ్చింది. దీంతో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు ఆ సంస్థకు చెందిన రూ.15 కోట్ల మేర ఆస్తులను జప్తు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News