: యూవీ కారణంగా ఓ రోజు ఢిల్లీ జెర్సీ మారనుంది


యువరాజ్ సింగ్ కారణంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కొత్త జెర్సీలో ఓ రోజు దర్శనమివ్వనుంది. యువరాజ్ సింగ్ ఆధ్వర్యంలోని 'యూ వీ కెన్' ఫౌండేషన్ సౌజన్యంతో మే డే రోజున పంజాబ్ తో జరిగే మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు నీలి ఎరుపు రంగుల దుస్తుల స్థానంలో లావెండర్ రంగు జెర్సీ ధరించనుంది. కేన్సర్ పై సమాజంలో అవగాహన పెంచేందుకు ఇలా చేయనున్నట్టు 'యూ వీ కెన్' ఫౌండేషన్ తెలిపింది. ఆ మ్యాచ్ ను సుమారు వంద మంది కేన్సర్ బాధితులు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ప్రత్యేక జెర్సీతో ఉన్న ఫోటోను యువీ తన ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు.

  • Loading...

More Telugu News