: స్నేహితులతో ఆటలాడితే అంతా మంచే!
స్నేహితులు కలిసినప్పుడు కూర్చుని సొల్లు కబుర్లు చెప్పుకోకుండా, మంచి వ్యాయామాన్ని ఇచ్చే ఆటలు ఆడడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) అదుపులోకి వస్తుందట. న్యూయార్క్ విశ్వ విద్యాలయం, దక్షిణ కాలిఫోర్నియా విశ్వ విద్యాలయం కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. కుటుంబీకులు, స్నేహితులు వంటి సన్నిహితులతో కలిసి ఆటలాడడం వల్ల కొవ్వు కరిగి, బీఎంఐ కంట్రోల్ లో వుంటుందని అధ్యయనకారులు సెలవిస్తున్నారు. అంతేకాదు, ఇలాంటి సామాజిక ఆటల వల్ల మన ప్రవర్తనలో కూడా మార్పులొచ్చి, సానుకూల దృక్పథం వంటబడుతుందట. దీని వల్ల చక్కని జీవనశైలి కూడా అలవడుతుందని అంటున్నారు. ముఖ్యంగా మధ్య వయస్కుల వారిపై ఈ మార్పులు గణనీయంగా కనిపించాయని అధ్యయనకర్తలు వెల్లడించారు.