: తొలి వికెట్ డౌన్... దూకుడు ప్రదర్శించి అవుటైన మెక్ కల్లమ్


కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. దూకుడు ప్రదర్శించిన మెక్ కల్లమ్ 19 పరుగులు చేసి చావ్లా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అటు, మరో ఓపెనర్ డ్వేన్ స్మిత్ కూడా ధాటిగా ఆడుతున్నాడు. వన్ డౌన్ లో వచ్చిన రైనా ఓ సిక్స్ బాది తన ఉద్దేశాన్ని చాటాడు. ప్రస్తుతం సూపర్ కింగ్స్ స్కోరు 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 48 పరుగులు. స్మిత్ (20 బ్యాటింగ్), రైనా (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ధోనీ, డు ప్లెసిస్ బ్యాటింగ్ ఆర్డర్లో తర్వాత వస్తారు.

  • Loading...

More Telugu News