: తుక్కుగా పడి ఉన్న తొలి మారుతీని కొనేందుకు సెలబ్రిటీల పోటీ


ఏదయినా ప్రతిష్ఠాత్మక సంస్థ చేసిన తొలి ఉత్పత్తికి ఉండే గొప్పదనం అంతా ఇంతా కాదు. కాలం పెరిగే కొద్దీ దాని విలువ పెరుగుతుంది. ఏదయినా తొలి వస్తువును సొంతం చేసుకుంటే, అది పాడైపోయినా దానిని భద్రపరిచేందుకే మొగ్గుచూపుతారు. భారతదేశంలో మారుతీ కార్ల సంస్థ ఉత్పత్తి చేసిన తొలి కారు తుక్కుగా పడి ఉందని ఈ మధ్య వార్తలలో వెలుగుచూసింది. దీంతో, దానిని కొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు ఆసక్తి చూపుతున్నారు. కేరళ సూపర్ స్టార్ మమ్ముట్టి, హెరిటేజ్ ట్రాన్స్ పోర్ట్ యజమాని, ప్రముఖ క్విజ్ మాస్టర్ డెరిక్ ఓబ్రెయిన్, మరికొంత మంది సెలబ్రిటీలు దానిని సొంతం చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తన మొదటి కారు మారుతీ కారు అని, దేశంలో ఉత్పత్తైన తొలి కారు కనుక దానిని కొనాలని భావిస్తున్నట్టు మమ్ముట్టి పేర్కొంటున్నారు. అయితే కారు యజమాని హర్ పాల్ సింగ్ మాత్రం దానిని మారుతీ కంపెనీకి ఇవ్వాలని భావిస్తున్నారు. మారుతీ ఉత్పత్తి చేసిన తొలి కారు లాటరీలో ఆయనకు దక్కగా, దాని తాళాలు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా హర్ పాల్ సింగ్ కు అందజేశారు.

  • Loading...

More Telugu News