: రైతుల కోసం లోకల్ రైలెక్కిన రాహుల్


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పంజాబ్ లో పర్యటించారు. రైతుల దుస్థితిపై ఆయన తన పర్యటనలో వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. లోకల్ ట్రైన్లో ఆయన ఢిల్లీ నుంచి పంజాబ్ వెళ్లారు. దీంతో, ఆయనను చూసేందుకు మార్గమధ్యంలోని స్టేషన్లలో జనసందోహం నెలకొంది. రైలులోని ప్రయాణికులు కూడా రాహుల్ సాధారణ వ్యక్తిలా లోకల్ రైలెక్కడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా, అంబాలా, గోవింద్ గఢ్ ప్రాంతాల్లో ఆయన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతుల భూమిని లాగేసుకునేందుకే కేంద్రం భూసేకరణ చట్టం తెస్తోందని మండిపడ్డారు. రైతులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దేశానికి రైతులు అన్నదాతలను పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News