: టీడీపీ నేత వర్ల రామయ్యపై దళిత సంఘాల కేసు
టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యపై భూ ఆక్రమణ కేసు నమోదైంది. కృష్ణా జిల్లా విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ లో దళిత సంఘాలు రామయ్యపై ఫిర్యాదు చేశాయి. దీంతో స్పందించిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 420, 405, 3, ప్రివెన్షన్ ఆఫ్ డామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ (1984) చట్టం కింద ఆయనపై కేసులు నమోదు చేశారు.