: కుక్కల్లా కాపలా ఉంటాం: ఎర్రబెల్లి


టీఆర్ఎస్ సభలో చంద్రబాబును తిట్టడం మినహా మరేమీ చేయలేదని, ఆ సభ ద్వారా ప్రజలకు కలిగిన మేలు ఏమీ లేదని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ధ్వజమెత్తారు. తెలంగాణకు కుక్కల్లా కాపలా ఉంటామని, నక్కల మోసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటామని ఉద్ఘాటించారు. వాటర్ గ్రిడ్ పేరుతో కొడుక్కి కోట్లు అప్పజెప్పారంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. నిన్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగింది తెలంగాణ ద్రోహుల సభ అని ఎద్దేవా చేశారు. దమ్ముంటే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఎర్రబెల్లి సవాల్ విసిరారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ ను చిత్తుగా ఓడిస్తుందన్న భయంతోనే చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News