: ఆర్టీసీలో అధికారుల విభజన పూర్తి... మే 14 నుంచి ఎవరి కార్యకలాపాలు వారివే!
ఆర్టీసీ విభజన ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అధికారుల విభజనను ఆర్టీసీ యాజమాన్యం పూర్తి చేసింది. మే 14 నుంచి ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ పరిపాలన కార్యకలాపాలు విడివిడిగా జరుగుతాయని, పరిపాలన విభాగాలు కూడా అదే రోజు నుంచి విడిగానే పనిచేయడం ప్రారంభిస్తాయని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. పరిపాలన విభాగాలకు సంబంధించి ఆయన ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు.