: ప్రజాప్రతినిధుల సమావేశంలో తప్పతాగి రచ్చ చేసిన దక్షిణాది నటి!
దక్షిణాదిన హీరోయిన్ గా హవా సాగించిన ఊర్వశి, ఆపై ఇతర పాత్రలతోనూ చిత్ర పరిశ్రమతో అనుబంధం కొనసాగిస్తోంది. ఊర్వశి ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు దక్కాయి కూడా. నటన పరంగా ఈమెకు ఫుల్ మార్కులు వేయవచ్చు గానీ, ప్రవర్తన పరంగా ఈ నటీమణికి పాస్ మార్కులు కూడా వేయలేం! ఎందుకంటే, తన విడాకుల కేసు విచారణ సమయంలో కుటుంబ న్యాయస్థానానికి తాగి వచ్చిన ఘనత ఊర్వశి సొంతం మరి. తాజాగా, ఎల్ డీఎఫ్ ఆధ్వర్యంలో కేరళలో ఫిమేల్ లెజిస్లేటివ్ స్టాఫ్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి ఊర్వశిని అతిథిగా ఆహ్వానించారు. అయితే, ఫుల్లుగా మందు లాగించి, ఆలస్యంగా ఆ మీటింగుకి వచ్చిన అమ్మడు తూలుకుంటూ స్టేజి ఎక్కి, ఇష్టం వచ్చినట్టు వాగేసరికి నిర్వాహకులు అవాక్కయ్యారు. అసలు ఆ మీటింగు ఎవరు నిర్వహిస్తున్నారో కూడా అమ్మడు మర్చిపోయింది. దాంతో, ఇది ఎల్ డీఎఫ్ సమావేశమా? బీజేపీ సమావేశమా? అంటూ మద్యం మత్తులో ఆవిడ ధర్మ సందేహం వెలిబుచ్చేసరికి నిర్వాహకులు తెల్లమొహాలు వేశారు. అప్పటికే మద్యం కిక్కు తలకెక్కేయడంతో ఊర్వశి రచ్చ చేసిందట. దీంతో, ఆమెను బలవంతంగా కిందికి దించి అక్కడి నుంచి పంపాల్సివచ్చింది. చివరికి మరో అతిథితో కార్యక్రమాన్ని ప్రారంభించారు.