: మెమరీ కార్డు కోసం తండ్రిని చంపేశాడు!


మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. మెమరీకార్డు కోసం ఓ యువకుడు తండ్రిని చంపేశాడు. వివరాల్లోకెళితే... జిల్లాలోని సంగిదేవిపల్లిలో హన్మంతు అనే వ్యక్తికి రాజు అనే కుమారుడున్నాడు. ఇటీవల హన్మంతు కుమారుడి మెమరీ కార్డు తీసుకున్నాడు. తన మెమరీ కార్డు ఇవ్వాలని హన్మంతు తండ్రిని అడిగితే, అతడు నిరాకరించాడు. దీంతో, వారిరువురి మధ్య ఘర్షణ నెలకొంది. రాత్రి వేళ నిద్ర పోతున్న తండ్రిపై రాజు బండరాయితో దాడి చేశాడు. దీంతో, హన్మంతు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకున్న విషయం ఇంకా తెలియరాలేదు.

  • Loading...

More Telugu News