: తిరుమలలో చంద్రబాబు మార్కు పాలన... టీటీడీ నూతన చైర్మన్ చదలవాడ
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మార్కు పాలనను అందిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. నేటి ఉదయం హైదరాబాదులో చంద్రబాబుతో భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల వెంకన్న దర్శనంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ధర్మక్షేత్రం లాంటి తిరుమలలో ధర్మపాలన సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.