: భూకంప మృతుల సంఖ్య 10 వేలకు చేరొచ్చు: నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాల వెల్లడి
నేపాల్ ను నేలమట్టం చేసిన భూకంపం కారణంగా చనిపోయిన వారి సంఖ్య పది వేలకు చేరే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ఈ దుర్ఘటనలో 4,350 మంది చనిపోయినట్లు ఆ దేశ ప్రధాని సుశీల్ కొయిరాల ప్రకటించారు. మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో చనిపోయినవారు పది వేలకు పైగానే ఉండే ప్రమాదం లేకపోలేదని ఆయన కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యల్లో భారీ సంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇక భూకంపం కారణంగా గాయపడ్డ 17 వేల మందికి పైగా క్షతగాత్రులు ఆ దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.