: ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి!: లోక్ సభలో మురళీమోహన్ డిమాండ్
దివంగత నందమూరి తారకరామారావుకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ మరోసారి పార్లమెంట్ లో వినిపించింది. ఈ మేరకు నిన్నటి లోక్ సభ సమావేశాల్లో భాగంగా జీరో అవర్ లో టీడీపీ ఎంపీ మురళీమోహన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. తెలుగు భాష, సంస్కృతికి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ భారతరత్నకు అర్హుడేనని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ చలనచిత్ర రంగంలో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటారని ఆయన పేర్కొన్నారు. 1984- 1989 మధ్య లోక్ సభలో టీడీపీనే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మురళీమోహన్ గుర్తు చేశారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడం సమంజసమని, ఈ దిశగా కేంద్రం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.