: ఆహారపు అలవాట్లు మార్చుకుంటే చాలు.. ఆరోగ్యానికి మేలు
మనలో ఎక్కువ మందిని బాధపెడుతూ ఉండే ఆరోగ్య సమస్యలు బీపీ, షుగర్ వంటివే. ఇవన్నీ మెటబాలిజం సంబంధితమైన సమస్యలు. మనం ఆహారం తీసుకునే అలవాట్లలో కొద్దిగా మార్పులు చేసుకోవడం వలన ఇలాంటి మెటబాలిజం వలన ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చునని పరిశోధకులు సశాస్త్రీయంగా నిరూపించారు. పళ్లు, కూరగాయలు, పప్పుదినుసులు, ఆలివ్ నూనె ఎక్కువగా తీసుకోవాలట.పాలు, మాంసం తక్కువగా తీస్కోవాలట. స్వీట్లు క్రీములు అయితే.. చాలా చాలా తక్కువగా తీసుకోవాలట. అలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నట్లయితే.. కీలక రోగాలు దూరంగా ఉంటాయిట.
ఆహారంలో ఈ సరైన నిష్పత్తిని మధ్యాధరా ఆహారం మెటిటెరానియన్ డైట్ అని పిలుస్తారు. ఇలాంటి ఆహారం వృద్ధుల్లో హైపర్ యూరిసీమియా అనే దానిని నివారిస్తుంది. అది.. సాధారణంగా బీపీ, షుగర్, కిడ్నీ సంబంధ సమస్యలను కలిగిస్తూ ఉంటుంది. ఆహారంలో ఈ సంతులనం పాటిస్తే.. అలాంటి వాటికి దూరం జరగవచ్చునన్నది అధ్యననం తేలుస్తున్న సంగతి.