: ఒక్కో తీగకు ఒక్కో పార్టీ జెండా కట్టమని చెప్పా... కానీ, మూడు తీగలకూ టీఆర్ఎస్ జెండానే కట్టారు: కేసీఆర్


టీఆర్ఎస్ సభలో కేసీఆర్ ఆవేశపూరితంగా ప్రసంగిస్తున్నారు. ఎన్నికల వేళ కరెంటు స్తంభాలకు ఉండే మూడు తీగల్లో ఓ తీగకు టీడీపీ జెండా, మరో దానికి కాంగ్రెస్ జెండా, ఇంకో దానికి వామపక్షాల జెండాలు కడితే కరెంటు బ్రహ్మాండంగా వస్తుందని చెప్పానని, అయితే, మూడు తీగలకు టీఆర్ఎస్ జెండాలు కడితేనే కరెంటు వస్తుందని ప్రజలు భావించారని వివరించారు. అదే చేసి చూపించారని కొనియాడారు. వచ్చే మార్చి నుంచి కరెంటు కోతల్లేని తెలంగాణను చూడొచ్చని తెలిపారు. రైతులు రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, తేలు, పాము కాట్లకు గురై ప్రాణాలు విడవాల్సిన పరిస్థితి తలెత్తదని అన్నారు. నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. ఇక, ఇంటింటికీ తాగు నీరు అందించడమే మరో ముఖ్య లక్ష్యమని చెప్పారు. అలా ఇవ్వలేకపోతే టీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడగబోదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News