: 94 శాతం ఓట్లతో సూడాన్ అధ్యక్షుడు విజయం
అంతర్జాతీయ సమాజం ఒత్తిడి మేరకు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో సూడాన్ ప్రస్తుత అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్ మళ్లీ విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో 94 శాతం ఓట్లు సాధించి అఖండ మెజారిటీ సంపాదించారు. 426 సీట్లు గల సూడాన్ పార్లమెంటులో ఒమర్ అల్ బషీర్ కు చెందిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ 323 సీట్లు సాధించడం విశేషం. 2011లో జరిగిన ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగలేదని, నిర్బంధంగా జరిగాయని అంతర్జాతీయ సమాజం ఆరోపించింది. ఈ నేపథ్యంలో పెరిగిన ఒత్తిడితో సూడాన్ లో తాజా ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించారు.