: నేపాల్ కోలుకోవాలంటే 5 బిలియన్ డాలర్లు కావాలట!
ప్రకృతి బీభత్సానికి అతలాకుతలమైపోయిన నేపాల్ తిరిగి కోలుకునేందుకు సుమారు 5 బిలియన్ డాలర్లకు పైగా అవసరమని అమెరికాలోని కొలరాడోకు చెందిన ఏషియా పసిఫిక్ చీఫ్ ఎకానమిస్ట్ రాజీవ్ బిశ్వాస్ అంచనా వేశారు. నేపాల్ ఏడాది జీడీపీ కేవలం వెయ్యి డాలర్లని, ఎక్కువ మంది నేపాలీలు పేదలని, ఇంత పెద్ద సహాయం కావాలంటే అంతర్జాతీయ ఫైనాన్స్, టెక్నికల్ సంస్థల సహాయం సుదీర్ఘకాలం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. నేపాల్ పునరుద్ధరణకు, సహాయ కార్యక్రమాలకు నేపాల్ వద్ద ప్రస్తుతం తక్కువ ఆర్థిక వనరులున్నాయని ఆయన పేర్కొన్నారు. వాటితో నేపాల్ పునర్నిర్మాణం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. భవనాలు గట్టిగా ఉండేలా, స్థిరమైన ప్రమాణాలతో ఉండేలా నిర్మించేందుకు దాదాపు 5 బిలియన్ల డాలర్లు ఉండాలని ఆయన తెలిపారు.