: టీటీడీ చైర్మన్ గా చదలవాడ కృష్ణమూర్తి
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా చదలవాడ కృష్ణమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మరికాసేపట్లో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. టీటీడీ బోర్డులో సభ్యులుగా దర్శకుడు కె.రాఘవేంద్రరావు, కొండపి ఎమ్మెల్యే డోలా వీరాంజనేయులు, ఏవీ రమణ, సండ్ర వెంకటవీరయ్య, పిల్లి అనంతలక్ష్మీ, కోళ్ల లలితకుమారి, సాయన్న, వై.టి.రాజా, పుట్టా సుధాకర్ యాదవ్, పి.హరిప్రసాద్, డీపీ.అనంత, భానుప్రకాశ్ రెడ్డి తదితరులు ఉన్నారు.