: కుక్క తప్పిపోయిందంటూ ఫిర్యాదు...6000 బహుమతి ప్రకటన
మనుషులు తప్పిపోయారంటూ ఫిర్యాదు చేయడం సర్వసాధారణం...కానీ కుక్క కనిపించడం లేదంటూ ఓ పోలీస్ ఇన్ స్పెక్టర్ భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని మాలవ్యనగర్ లోని పోలీస్ స్టేషన్ లో ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ప్రభునాథ్ సరోజ్ భార్య శకుంతల జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కపిల్లను పెంచుకుంటున్నారు. దాని పేరు టైగర్. ఇది గత శనివారం నుంచి కనిపించడం లేదని, ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ కుక్కపిల్లను తెచ్చిఇస్తే 6000 రూపాయల నగదు బహుమతి అందజేస్తామని ఆమె ప్రకటించారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేశారు.