: ఆ సినిమా షూటింగు సరదాగా గడిచింది!: సన్నీలియోన్
'కుచ్ కుచ్ లోచాహై' సినిమా హీరో రామ్ కపూర్ తో కలిసి నటించడం ఎంతో బాగుందని బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ తెలిపింది. మే 8న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా సినిమా బృందం ప్రమోషన్ లో పాల్గొంది. ఈ సందర్భంగా సన్నీ మాట్లాడుతూ, రామ్ కపూర్ సెట్స్ లో ఉంటే వాతావరణం మొత్తాన్ని ఆహ్లాదకరంగా మార్చేసేవాడని చెప్పింది. రామ్ కపూర్ నిజమైన హాస్యనటుడని సన్నీ లియోన్ కితాబిచ్చింది. తను చాలా ఫన్నీగా ఉంటాడని, అతనితో షూటింగ్ చేయడం ఎంతో నచ్చిందని సన్నీలియోన్ వెల్లడించింది. 45 ఏళ్ల పెళ్లైన వ్యక్తిగా రామ్ కపూర్ నటించాడని, ఓ సందర్భంగా అతను సినిమా హీరోయిన్ (సన్నీ లియోన్)ని కలిసే అవకాశం వస్తుందని, ఆ సందర్భంగా వీరి మధ్య చోటుచేసుకున్న సన్నివేశాలే 'కుచ్ కుచ్ లోచాహై' సినిమా అని దర్శకుడు దేవంగ్ డొలాకియా తెలిపారు.