: రీ-ఎంట్రీ వార్తలపై నోకియా స్పందన
ఫిన్లాండ్ దిగ్గజ సంస్థ నోకియా తిరిగి ఫోన్ మార్కెట్లోకి ప్రవేశిస్తుందన్న వార్తలు ఇటీవల జోరుగా షికారు చేస్తున్నాయి. వీటిపై నోకియా స్పందించింది. తిరిగి హ్యాండ్ సెట్ల తయారీకి పూనుకోవడం లేదని స్పష్టం చేసింది. పునరాగమనం చేస్తున్నట్టు వచ్చిన కథనాలు అవాస్తవమని తన వెబ్ సైట్లో పేర్కొంది. మొబైళ్ల తయారీ, విక్రయంపై ఎలాంటి తాజా ప్రణాళికలు లేవని తేల్చి చెప్పింది. గతేడాది నోకియా తన ఫోన్ వ్యాపారాన్ని సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు విక్రయించడం తెలిసిందే. ఆపిల్, శాంసంగ్ ల నుంచి తీవ్ర పోటీ ఎదురైన నేపథ్యంలో నోకియా ఆ నిర్ణయం తీసుకుంది.