: జయ కేసులో సుప్రీం తీర్పుపై కరుణానిధి హర్షం


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పు ఇవ్వొచ్చంటూ ఈరోజు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. దానిపై డీఎంకే అధినేత కరుణానిధి హర్షం వ్యక్తం చేశారు. న్యాయం, నిజాయతీ ఎప్పటికైనా గెలుస్తాయని మరోసారి రుజువైందని మీడియాతో అన్నారు. అయితే ఈ కేసు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందా? అని ప్రశ్నించగా, ఇప్పుడే తాము ఎన్నికల లెక్కలు వేసుకోవడంలేదన్నారు. ఈ తీర్పు తమ పార్టీకి పెద్ద విజయమని కరుణ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News