: ట్రాయ్ తీవ్ర నిర్లక్ష్యం... 10 లక్షలకు పైగా భారతీయుల ఇ-మెయిల్ వివరాలు వెల్లడి


టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారుల తీవ్ర నిర్లక్ష్యం సుమారు 10 లక్షల మందికిపైగా వాడుతున్న వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడీ వివరాలను బహిర్గతం చేసింది. నెట్ న్యూట్రాలిటీపై అభిప్రాయాలు కోరుతూ, మార్చి 27న ట్రాయ్ శ్వేతపత్రాన్ని విడుదల చేయగా, తమ అభిప్రాయాలు తెలుపుతూ, 10 లక్షలకు పైగా ఇ-మెయిల్స్ వెల్లువలా వచ్చిపడ్డ సంగతి తెలిసిందే. వ్యక్తులతో పాటు భారతీ ఎయిర్ టెల్, ఐడియా వంటి టెలికం సంస్థలు, సీఐఐ, అసోచామ్ వంటి ఇండస్ట్రీ బాడీలూ స్పందించి ఇంటర్నెట్ విషయంలో అన్ని కంపెనీలకూ ఒకే విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేశాయి. అందరి మెయిల్స్ క్రోఢీకరించిన ట్రాయ్ ఒక నివేదికను తయారు చేస్తూ, తనకు మెయిల్స్ పంపిన అందరి వివరాలనూ, వారిచ్చిన సూచనలనూ అధికారిక వెబ్ సైట్లో ఉంచింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 24 వరకూ మెయిల్స్ పంపిన వారి వివరాలు అందరికీ కనిపిస్తున్నాయి. ట్రాయ్ నిర్వాకంపై ఇప్పుడు దేశవ్యాప్త నిరసన వెల్లువెత్తుతోంది. ఇ-మెయిల్స్ వివరాలు http://trai.gov.in/Comments/27-Mar=to-10-Apr/27-mar.html లింకులో దర్శనమిస్తున్నాయి.

  • Loading...

More Telugu News