: మూడో రోజూ కంపించిన భూమి... నేపాల్ 3 వేలు దాటిన మృతులు
వరుస భూకంపాలతో నేపాల్ వణికి పోతోంది. మూడో రోజూ భూమి కంపించింది. దీనికితోడు భారీ వర్షాలు కురుస్తుండడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మంచుకొండల మధ్య ఆధ్యాత్మికతతో వెలుగొందే నేపాల్ మృత్యు భూమిగా మారగా, మరణించిన వారి సంఖ్య అధికారిక లెక్కల ప్రకారమే 3 వేలు దాటింది. అనధికారికంగా ఈ సంఖ్య మరో 2 నుంచి 4 వేల వరకూ అధికంగా ఉండవచ్చని సమాచారం. అప్పుడప్పుడూ ప్రకంపనలు వస్తుండడంతో ఆదివారం రాత్రంతా ప్రజలు వీధుల్లోనే గడిపారు. భారీ భూకంపంతో సర్వం కోల్పోయిన నేపాల్ వాసులు నరకం చూస్తున్నారు. ఆహారం, తాగునీరు, విద్యుత్ అవసరాలు తీరక తాత్కాలిక గుడారాల్లోనే ఉంటున్నారు. అంతర్జాతీయ దేశాల సహాయంతో సమస్యలను ఎదుర్కొంటామని నేపాల్ ప్రధాని వ్యాఖ్యానించారు. భూకంపంతో కుదేలైన నేపాల్ ను ఆదుకునేందుకు మరిన్ని సహాయక బృందాలను పంపుతున్నట్టు భారత్ ప్రకటించింది.